ఎక్కడెక్కడంటే..

11 Nov, 2023 01:30 IST|Sakshi

● జడ్చర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అనిరుధ్‌రెడ్డికి టికెట్‌ కేటాయించగా నామినేషన్‌ వేశారు. అయితే అనిరుధ్‌రెడ్డి తల్లి శకుంతల కాంగ్రెస్‌ పార్టీ నుంచి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ●

● గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి పార్టీ టికెట్‌ కేటాయించింది. అయితే ఇటీవల ఆయనకు కోర్టు ద్వారా చిక్కులు ఎదురవడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున తన భార్య బండ్ల జ్యోతితో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయించారు. బండ్ల జ్యోతి గత ఎన్నికల్లో కూడా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

● కొల్లాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి పార్టీ టికెట్‌ కేటాయించింది. ఈయన భార్య బీరం విజయ కూడా బీఆర్‌ఎస్‌ తరపున రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

● నాగర్‌కర్నూల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ కేటాయించింది. ఈ క్రమంలో మర్రి భార్య జమున బీఆర్‌ఎస్‌ నుంచి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

● అచ్చంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ వంశీకృష్ణకు టికెట్‌ కేటాయించింది. ఈయన భార్య డాక్టర్‌ అనురాధ సైతం పార్టీ తరపున డమ్మీ అభ్యర్థిగా అచ్చంపేట నియోజకవర్గం నుంచి నామినేషన్‌ పత్రం దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు