పోలింగ్‌ కేంద్రాలు తెలిసేలా నంబర్లు

11 Nov, 2023 01:30 IST|Sakshi

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు అన్నిరకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అధికారులు పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మౌలిక వసతులు కల్పించారు. అయితే పోలింగ్‌ రోజు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు తమ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొత్తగా ఓటర్ల సంఖ్య పెరగడంతో కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాలు మారాయి. ఇలాంటి పరిస్థితిలో అందరికీ తెలిసేలా పోలింగ్‌ కేంద్రం ఎదుట సంఖ్య రాస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించింది. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ పరిధిలో 272, జడ్చర్లలో 274, దేవకరద్రలో 289 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. అయితే మహబూబ్‌నగర్‌కు 74, జడ్చర్లకు 75, దేవరకద్రకు 76 నంబర్లను కేటాయించారు.

మరిన్ని వార్తలు