మయూర వాహనంపై.. కురుమూర్తిరాయుడు

15 Nov, 2023 01:12 IST|Sakshi

శ్రీదేవి, భూదేవి సమేతుడైన కురుమూర్తిస్వామి మయూర వాహనంపై ఊరేగారు. పల్లకీలో ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి.. ప్రధాన ఆలయం నుంచి ఉద్దాల మండపం వరకు ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మొదటిరోజు నిర్వహించిన కార్యక్రమానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, కమిటీ సభ్యులు నాగరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, సిబ్బంది శివానందచారి, శ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

– చిన్నచింతకుంట

మరిన్ని వార్తలు