ఓట్ల రీకౌంటింగ్‌కు సమయం

3 Dec, 2023 00:44 IST|Sakshi

కల్వకుర్తి టౌన్‌: ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించటం అంటూ ఉండదు. ఓటింగ్‌ యంత్రంలో నమోదైన ప్రతి ఓటు చెల్లుబాటయ్యేదే. అది చెల్లదు అనే విషయానికి, వివాదానికి తావు లేదు. పోలింగ్‌ స్టేషన్‌ ఓటింగ్‌ ఫలితాన్ని కొంత మంది అభ్యర్థులు, వారి ఏజెంట్లు రాసి పెట్టుకుని ఉండకపోతే, ఫలితం–1 బటన్‌ను నొక్కుతారు. అప్పుడు కంట్రోల్‌ యూనిట్‌లోని డిస్‌ప్లే ప్యానళ్లలో ఆ పోలింగ్‌ స్టేషన్‌ ఓటింగ్‌ ఫలితం కనిపిస్తుంది.

● మొత్తం లెక్కింపు పూర్తయిన తర్వాత రిటర్నింగ్‌ అధికారి తుది ఫలితం ఫారం–20లో నమోదైనట్లు, ప్రతి అభ్యర్థి పొందిన మొత్తం ఓట్ల సంఖ్యను ప్రకటిస్తారు. ప్రకటన పూర్తయ్యాక అభ్యర్థి లేదా అతని గైర్హాజరులో అతని ఏజెంటు లేదా కౌంటింగ్‌ ఏజెంట్లలో ఏ ఒక్కరయినా అన్ని లేదా పోలింగ్‌ స్టేషన్‌లో అయినా నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించాలని లిఖితపూర్వకంగా అందుకు కారణాలను వివరిస్తూ అభ్యర్థన ఇవ్వాలి.

● ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు ఆధారంగా ఎన్నికల నిర్వహణ నియమావళి నియమం 56–డి ప్రకారం రిటర్నింగ్‌ అధికారి మళ్లీ ఓట్ల లెక్కింపునకు నిర్ణయం తీసుకుంటారు. వీవీప్యాట్‌లో ముద్రితమైన పేపర్‌ స్లిప్పులను లెక్కిస్తారు.

● రిటర్నింగ్‌ అధికారి ఓట్ల రీకౌంటింగ్‌, లిఖిత అభ్యర్థన ఇచ్చేందుకు ఖచ్చితంగా సమయం, నిమిషాలను ప్రకటిస్తారు. అంతలోపు ఏదైనా అభ్యర్థన వస్తే పరిశీలించి సహేతుకం అయితే నిర్ణయం తీసుకుంటారు.

● రిటర్నింగ్‌ అధికారి ఫలితం షీట్‌ను పూర్తిచేసి సంతకం చేశాక ఎలాంటి అభ్యర్థనకు హక్కు ఉండదు.

● ఓట్ల లెక్కింపు తర్వాత ఫారం–17సి భాగం–2లో ఫలితంలో అభ్యర్థి వారిగా కంట్రోల్‌ యూనిట్‌లో నమోదైన ఓటింగ్‌ ఫలితాలను నింపాక తుది ఫలితం షీట్‌ ఫారం–20 కూడా నింపి రిటర్నింగ్‌ అధికారి తన సీల్‌తో యూనిట్లను మళ్లీ సీల్‌ చేస్తారు.

అంతలోపే కారణాలు చూపి

లెటర్‌ అందించాలి

ఫలితం ప్రకటిస్తే రిటర్నింగ్‌ అధికారి చేసేదేమీ ఉండదు

అనుమానం ఉంటే వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించమని కోరవచ్చు

మరిన్ని వార్తలు