ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత మహబూబ్‌నగర్‌

3 Dec, 2023 00:44 IST|Sakshi
అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు

జడ్చర్ల టౌన్‌: బాదేపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అండర్‌–17 ఫుట్‌బాల్‌ బాలుర టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్‌ జట్టు నిలిచింది. పోటీలో మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు చెందిన 5 జట్లు 10 లీగ్‌ మ్యాచ్‌లు ఆడాయి. మహబూబ్‌నగర్‌ జట్టు విజేతగా.. గద్వాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. అలాగే ఈ నెలలో జరగనున్న రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును సైతం ఎంపిక చేశారు. ముగింపు కార్యక్రమానికి ఎంఈఓ మంజులాదేవి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌ హాజరై విజేతలతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. విజేతలు మరిన్ని విజయాల కోసం పాటు పడాలని, ఓటమి పాలైన వారు విజయం కోసం మరింత నైపుణ్యం సాధించాలని కోరారు. పోటీల్లో టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్షుడు విలియం, కార్యదర్శి కృష్ణ, పీడీలు మెర్సీ ఫ్రెంచ్‌, వడెన్న, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి భానుకిరణ్‌, కోచ్‌ వెంకట్రాములు, టోర్నీ నిర్వాహకుడు మోయిన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు