కురుమూర్తిస్వామికి ప్రత్యేక పూజలు

3 Dec, 2023 00:44 IST|Sakshi

చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి జాతరకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు కోనేటీలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో నిల్చున్నారు. మెట్లపై దీపాలు వెలిగించి గోవింద నామస్మరణలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి ముడుపులు కట్టారు. అనంతరం కొండ దిగువన మట్టికుండలో దాసంగాలు నైవేద్యంగా పెట్టారు. గండదీపాలు మోసి పిల్లాపాపలు చల్లంగా ఉండాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మైదానంలోని అంగళ్లలో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేశారు.

కురుమూర్తి స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

మరిన్ని వార్తలు