కిటకిటలాడిన అలంపూర్‌ ఆలయాలు

3 Dec, 2023 00:44 IST|Sakshi
జోగుళాంబ ఆలయ సన్నిధిలో మంత్రి నిరంజన్‌రెడ్డి

అలంపూర్‌ రూరల్‌: అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు.

ఆలయాలను దర్శించుకున్న

మంత్రి నిరంజన్‌రెడ్డి..

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి అలంపూర్‌ ఆలయాలను దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ చిన్న కృష్ణయ్య, ఈఓ పురేంధర్‌కుమార్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు