ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు మరో షాక్‌.. మాజీ సీఎం రాజీనామా

12 Feb, 2024 13:48 IST|Sakshi

ముంబై: లోక్‌సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ కాంగ్రెస్‌కు సోమవారం రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామాను రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ నానా పటోల్‌కు పంపించారు. అందులో కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు సింగిల్‌ లైన్‌ సమాధానం ఇచ్చారు.  

అలాగే అసెంబ్లీలో భోకర్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చవాన్‌.. స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌ను కలుసుకొని తన రాజీనామాను అందజేశారు. అయితే అశోక్‌ త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఆ పార్టీతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. చవాన్‌కు బీజేపీ రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్లు వినికిడి. 

ఇక ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే జనవరి 14న రాహుల్‌ సన్నిహితుడు, కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దేవరా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఇక మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, శరద్‌ పవరా్‌కు చెందిన ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.. తాజాగా మరో సీనియర్‌ నేత పార్టీని వీడటం కాంగ్రెస్‌ తీరని దెబ్బగానే చెప్పవచ్చు.
చదవండి: డిప్యూటీ సీఎం పదవులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega