పోలీసులకు ఫిర్యాదు చేసిన సివిల్స్‌ విన్నర్‌

8 Aug, 2020 20:12 IST|Sakshi

ముంబై: తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించిన 23 ఏళ్ల ఐశ్వర్య షెరాన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరుతో 20 నకిలీ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. తన అనుమతి లేకుండా ఖాతాలు సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కోలాబా పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ఐశ్వర్య గతంలో పలు అందాల పోటీల్లో తుళక్కుమన్నారు. 2016లో ఫెమినా మిస్‌ ఇండియా విజేతగా నిలిచారు. అయితే, ఇప్పటి వరకు తనకు ఇన్‌స్టాలో ఎలాంటి అకౌంట్లు లేవని ఆమె చెప్పుకొచ్చారు. ఆగస్టు 5న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో నకిలీ ఖాతాల విషయం వెలుగు చూసిందని అన్నారు. 
(చదవండి: బంగారం వద్దు.. రూ.2 వేలు చాలు..!)

‘మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అసలైనది ఏదీ? అని జర్నలిస్టు ప్రశ్నించడంతో నాకేం అర్థం కాలేదు. ఇన్‌స్టాలో నాకు అకౌంట్‌ లేదని చెప్పాను. వెంటనే మా తమ్ముడు సెర్చ్‌ చేయగా నా పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఫేక్‌ ఖాతాలు ఉన్నట్టు తెలిసింది. ఒక ఖాతాకైతే ఏకంగా 27 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. నా ఫొటోలను ఆ ఆగంతకులెవరో దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే ఫిర్యాదు చేశాం’అని ఐశ్వర్య పేర్కొన్నారు. కాగా, ఐశ్వర్య కలాబాలో తన కుటుంబంతో కలిసి 2017 నుంచి నివసిస్తన్నారు. ఆమె తండ్రి కల్నల్‌ అజయ్‌ కుమార్‌ కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ఇక ఐశ్వర్య ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని కోలాబా సీనియర్‌ ఇన్స్‌పెక్టర్‌ శివాజీ ఫడ్తారే చెప్పారు. సర్విస్‌ ప్రొవైడర్‌ సాయంతో నకిలీ ఖాతాలను క్లోజ్‌ చేయిస్తామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
(ఐపీఎస్‌ టు ఐఏఎస్)

Read latest Maharashtra News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు