ముగిసిన మధున పోచమ్మ జాతర

3 Dec, 2023 00:50 IST|Sakshi
మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

కోటపల్లి(చెన్నూర్‌) మండలంలోని జనగామలో మూడు రోజులుగా కన్నుల పండువగా సాగిన మధున పోచమ్మ జాతర శనివారం ముగిసింది. శివసత్తుల పూనకాలు, డప్పుచప్పుళ్లు, బోనాలతో భక్తులు అమ్మవారి చెంతకు చేరుకున్నారు. కొత్తకుండలో వండిన పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి సల్లంగా చూడు తల్లీ అంటూ వేడుకున్నారు. మొదటిరోజు గోదావరి పుణ్యసాన్నంతో జాతర ప్రారంభం కాగా రెండో రోజు రథయాత్ర, మూడో రోజు బోనాల సమర్పణతో జాతర ముగిసింది. జాతరకు జనగామ, వెంచపల్లి, సుపాక, నందరాపల్లి, ఆలుగామ, ఎదులబందం, బొప్పారం గ్రామాలతో పాటు చెన్నూర్‌ పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్‌ గట్టు లక్ష్మణ్‌గౌడ్‌ ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు