నేటి నుంచి ఓటర్‌ స్లిప్‌ల పంపిణీ

15 Nov, 2023 04:36 IST|Sakshi
విద్యార్థులతో కలెక్టర్‌ రాజర్షిషా

మెదక్‌ కలెక్టరేట్‌: సాధారణ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో నేటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఈనెల 26 వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజర్షిషా అధికారులకు సూచించారు. మంగళవారం మెదక్‌, నర్సాపూర్‌ ఆర్‌ఓలు, సెక్టార్‌ అధికారులు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్స్‌, బీఓల్‌ఓలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్‌ సమాచార స్లిప్‌లతోపాటు, ఓటర్‌ గైడ్‌, సీ–విజిల్‌ కరపత్రాలను ప్రతీ ఓటరుకు పంపిణీ చేయాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి బాధ్యత బీఎల్‌ఓలదేనన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్‌ స్లిప్‌లు పంపిణీ చేయొ ద్దని ఆదేశించారు. ఓటరు సమాచార స్లిప్‌ల పంపిణీకి నోడల్‌ అధికారులను నియమించినట్లు కలెక్టర్‌ తెలిపారు. మెదక్‌ నియోజక వర్గానికి నోడల్‌ అధికారిగా జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్‌ (94903 57522), నయాబ్‌ తహసీల్దార్‌ ప్రభాకర్‌ (98669 47429), నర్సాపూర్‌ నియోజక వర్గానికి సహదేవ్‌ (93469 99262)ను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌, మెదక్‌, నర్సాపూర్‌ ఆర్‌ఓలు, సెక్టార్‌ అధికారులు, పాల్గొన్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌లో..

ప్రతీ ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజర్షిషా, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు స్లిప్పుల పంపిణీ పర్యవేక్షణ నోడల్‌ అధికారులను నియమించాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ క్యాస్టింగ్‌ నిర్వహణ ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు.

26 వరకు పూర్తి చేయాలి

రాజకీయ పార్టీలు స్లిప్‌లు పంపిణీ చేయొద్దు

కలెక్టర్‌ రాజర్షిషా

పిల్లల హక్కులు గౌరవించండి

పిల్లల హక్కులను గౌరవించాలని కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా మంగళవారం మెదక్‌లోని బాలసదనంలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల రక్షణ యూనిట్‌ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ రాజర్షిషా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల హక్కులు, బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు బ్రహ్మాజీ, రాజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, కరుణ, గంగాధర్‌ గౌడ్‌ , పద్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు