ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు

15 Nov, 2023 04:36 IST|Sakshi
పవర్‌ పాయింట్‌ను తిలకిస్తున్న ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్‌, ఎస్పీ ఇతర అధికారులు

మెదక్‌ కలెక్టరేట్‌: ఎన్నికల విధుల్లో అధికారులు ఎ లాంటి అలసత్వం వహించొద్దని, ప్రశాంత వాతావరణంలో జరగాలని, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ రోహిణీప్రియదర్శిని, ఎన్నికల నోడల్‌ అధికారులు, పోలీస్‌ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ.. మెదక్‌లో ఆరు టీమ్‌లు, నర్సాపూర్‌లో ఆరు టీమ్‌లు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం జిల్లా వ్యయ పరిశీలకుడు సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అనుమతి తోనే ప్రచార సామగ్రి రవాణా చేయాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థి ఖర్చు నమోదు చేయాలని, ప్రతీ సంఘటనను వీడియో కెమెరాలో రికార్డ్‌ చేయాలని తెలిపారు. జిల్లా పోలీస్‌ పరిశీలకుడు సంతోష్‌ కుమార్‌ తుకారాం మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న ప్రజల వద్ద పోలీస్‌ అధికారి ఫోన్‌ నంబర్‌ తప్పక ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాట్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎన్నికల పరిశీలకులకు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంసీఎంసీ సెంటర్‌ పరిశీలన..

సాధారణ ఎన్నికల నేపథ్యంలో మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్‌ ఆఫ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) మీడియా సెంటర్‌ను జిల్లా ఎన్నికల పరిశీలకులు ముగ్గురూ పరిశీలించారు. జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డింగ్‌ పనితీరును సమీక్షించారు. అంతకు మెదక్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలోని ఈవీఎంల స్ట్రాంగ్‌రూంలను, హవేళిఘణాపూర్‌లోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించారు.

ప్రశాంత వాతావరణంలో జరగాలి

జిల్లా ఎన్నికల పరిశీలకుడు పృథ్వీరాజ్‌

మరిన్ని వార్తలు