ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే.. : మంత్రి హరీశ్‌రావు

18 Nov, 2023 06:40 IST|Sakshi

రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిందే మంత్రి హరీశ్‌రావు

మెదక్‌/గజ్వేల్‌: బీజేపీ నేత ఈటలకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆరేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల కోసం ఆపద మొక్కులతో ప్రజల్లోకి వస్తున్న నేతలకు బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్‌పై ఈటల పోటీ చేయడం చూస్తుంటే ఆయన నియత్తు లేదనేది అర్థం అవుతోందన్నారు.

హుజురాబాద్‌, గజ్వేల్‌కు పొంతన లేదని, రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదన్నారు. ఝూటా మాటలు చెబుతున్న కాంగ్రెస్‌, బీజేపీలను తరిమికొట్టాలన్నారు. రాష్ట్రం ప్రభుత్వం పింఛన్‌ పెంపు నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 5.35లక్షల మంది దివ్యాంగులకు మేలు చేకూరిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ భూంరెడ్డి, ఎలక్షన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు