కాంగ్రెస్‌ హవా..

5 Dec, 2023 05:30 IST|Sakshi
టేక్మాల్‌లో సంబరాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు(ఫైల్‌)

టేక్మాల్‌/రేగోడ్‌(మెదక్‌): కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా పేరున్న టేక్మాల్‌ మండలం సార్వత్రిక ఎన్నికల్లో తన హవా చాటుకుంది. మండలం ఆ పార్టీకి 4408 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. 29 పంచాయతీలకు గాను 27 పంచాయతీలలో మెజార్టీ సాధించగా కేవలం రెండు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మెజార్టీ వచ్చింది. హెచెంపల్లిలో 36 ఓట్లు, ఎలకుర్తిలో 143, కోరంపల్లిలో 212, ఎక్లాస్‌పూర్‌లో 135, కాద్లూర్‌లో 302, బొడ్మట్‌పల్లిలో 82, బర్దిపూర్‌లో 167, పల్వంచలో 441, కుసంగిలో 393, దాదాయిపల్లిలో 106, మల్కాపూర్‌లో 72, తంప్లూర్‌లో 272, సూరంపల్లిలో 76, కమ్మరికత్తలో 194, బొడగట్టులో 98, ఎల్లుపేటలో 62, శాబాద్‌తాండా 200, ఎల్లంపల్లిలో 111, వెంకటాపూర్‌ 339, సర్మోనికుంటలో 239, టేక్మాల్‌లో 352, సాలోజిపల్లిలో 70 ఓట్లను కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ వచ్చింది. అందోల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి దమోదార రాజనర్సింహ గెలుపునకు టేక్మాల్‌ మండలం 4408 ఓట్ల మెజార్టీ ఇవ్వడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

రేగోడ్‌లో 539 మెజార్టీ

మండలంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో అన్ని గ్రామాల్లో తన హవాను కొనసా గింది. 539 ఓట్ల మెజార్టీతో రికార్డ్‌ బ్రేక్‌ చేసింది. చౌదర్‌పల్లిలో కాంగ్రెస్‌కు 23, మర్పల్లిలో 257, పోచారంలో 65, బురాన్‌వాడి తండాలో 182, సిందోల్‌లో 140, తాటిపల్లిలో 99, గజ్వాడలో 280, ప్యారారంలో 46, కొత్వాన్‌పల్లిలో 71, వెంకటాపూర్‌లో 85, కొండాపూర్‌లో 73, జగిర్యాలలో 161, దోసపల్లిలో 11, పెద్దతండాలో 91, ఆర్‌.ఇటిక్యాలలో 128 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. కేవలం టి.లింగంపల్లిలో బీఆర్‌ఎస్‌కు 39, తిమ్మాపూర్‌లో 7 మెజార్టీ ఓట్లు వచ్చాయి. మొత్తంగా మండలంలో కాంగ్రెస్‌ పార్టీ 2,251 ఓట్లు మెజార్టీ తీసుకుని తన సత్తాను చాటుకుంది.

టేక్మాల్‌, రేగోడ్‌లో మెజార్టీ

>
మరిన్ని వార్తలు