నవ్వులు పూయిస్తున్న‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్‌

25 Aug, 2021 15:15 IST|Sakshi

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహానీశర్మ హీరోయిన్‌. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌ సమర్పిస్తున్నారు. సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది చిత్ర యూనిట్‌. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదల చేశారు.ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.  


(చదవండి: ఒక్క రోజు లేట్‌ అయితే చచ్చిపోయేవాడ్ని.. చిరంజీవి కాపాడాడు : బండ్ల గణేశ్‌)

అవసరాల శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. తన పెళ్ళికి బట్టతల అడ్డంకిగా మారడం వంటి ఎమోషన్ సీన్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచేశారు. నాలుగు అక్షరాలు.. ఇది ఉంటే వివాహానికి ఇబ్బంది ఏంటది అని తల్లి పజిల్‌ వేయగా.. బట్టతల అని శ్రీనివాస్‌ జవాబుఇవ్వడం హిలేరియస్‌గా ఉంది. ‘ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి’, అని హీరో వేడుకోవడం నవ్వులు పూయిస్తుంది.  కాగా, గతంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా అవసరాల శ్రీనివాస్‌ బట్టతల వీడియోను చిత్ర యూనిట్‌ వైరల్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు