Pushpa Dialogue Viral: ఆన్సర్‌ షీట్‌లో 'పుష్ప' డైలాగ్స్‌ రాసిన టెన్త్‌ స్టూడెంట్‌

7 Apr, 2022 12:42 IST|Sakshi

అ‍ల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగించింది. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులు సోషల్‌ మీడియాను ఓ రేంజ్‌లో షేక్‌ చేశాయి. ముఖ్యంగా బన్నీ మ్యానరిజంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రం​ విడుదలై సుమారు నాలుగు నెలలు కావొస్తున్నా పుష్ప క్రేజ్‌ మాత్రం ఇంకా తగ్గలేదు. ఇటీవలె పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ఆన్సర్‌ షీట్‌లో సమాధానాలకు బదులు పుష్ప డైలాగులు రాశాడు.  ‘పుష్ప, పుష్ప రాజ్‌.. అపున్ లిఖేగా నహీ(పరీక్ష రాసేదేలే)’అని రాసేశాడు. దీనికి సంబంధించిన ఆన్సర్‌ షీట్‌ను ఉపాధ్యాయుడు ఫోటో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.  

మరిన్ని వార్తలు