నిఖిల్‌ ఇంటికి ‘18 పేజెస్‌’స్పెషల్‌ గిఫ్ట్‌.. షాకైన యంగ్‌ హీరో

1 Jun, 2021 17:33 IST|Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌ బర్త్‌డే నేడు (జూన్‌ 1). ఈ సందర్భంగా ఆయనకు ‘18 పేజెస్‌’స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. నిఖిల్‌, అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరో హీరోయిన్లుగా  మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమే ‘18 పేజెస్‌’. కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నిఖిల్‌ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా ఆయనకు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది. నిఖిల్‌ ఇంటికి ఓ పెద్ద కేకును, బొకే పంపించి బర్త్‌డే విషెస్‌ చెప్పింది.  ‘18 పేజెస్‌’ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఉన్న ఆ కేకు చూసి నిఖిల్‌ షాకయ్యాడు. తనకు ఇంతమంచి గిఫ్ట్‌ ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్‌, సుకుమార్‌, డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌కి థ్యాంక్స్‌ చెప్పాడు. అలాగే తనకు పంపించిన కేకును కట్‌ చేయకుండా మెమోరీగా దాచుకున్నాడు. 

చదవండి: 
టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవంటున్న అనుపమ
అక్షయ్‌ కుమార్‌ ‘పృథ్వీరాజ్‌’ మూవీపై కర్ణి సేనా ఆగ్రహం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు