1996 Dharmapuri: ధర్మపురిని ఆదరించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌

22 Apr, 2022 08:13 IST|Sakshi

‘‘ధర్మపురి పేరుతో జగత్‌గారు సినిమా తీశారని తెలియగానే ఆశ్చర్యం కలిగింది. గోదావరి తీరాన పురాతనమైన ధర్మపురి గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఆలయం పేరుతో వస్తున్న ‘1996 ధర్మపురి’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. గగన్‌ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1996 ధర్మపురి’. శేఖర్‌ మాస్టర్‌ సమర్పణలో భాస్కర్‌ యాదవ్‌ దాసరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి దర్శకుడు మారుతి, నిర్మాతలు వై.రవి శంకర్, యస్‌.కె.యన్, సెవెన్‌ హిల్స్‌ సతీష్, రచయిత డార్లింగ్‌ స్వామి, నటుడు జీవీ అతిథులుగా హాజరై, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. ‘‘జగత్‌ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది’’ అన్నారు. ‘‘మా సినిమాను సపోర్ట్‌ చేస్తూ రిలీజ్‌ చేస్తున్న ఏషియన్‌ డిస్ట్రిబ్యూషన్‌ వారికి, గీతా ఆర్ట్స్‌ వారికి థ్యాంక్స్‌’’ అన్నారు చిత్ర నిర్మాత భాస్కర్‌. ‘‘ప్రస్థానం’తో నా జర్నీ స్టార్ట్‌ అయ్యింది. ‘1996 ధర్మపురి’ చాలా బాగా వచ్చింది’’ అన్నారు జగత్‌. ‘‘చిన్న చిన్న రోల్స్‌ చేసుకునే నన్ను హీరోగా చేసి, నా ప్రతిభని బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు గగన్‌.

చదవండి: మాటల్లో చెప్పలేని తిట్లు, భౌతిక దాడి చేసింది.. వాపోయిన హీరో

నన్ను గర్భవతిని చేసి మోసం చేసింది ఆ డైరెక్టర్‌ కాదు!

మరిన్ని వార్తలు