1997 Movie: నవీన్‌ చంద్ర, కోటి సినిమా రిలీజ్‌ డేట్‌​ వచ్చేసింది!

7 Nov, 2021 20:50 IST|Sakshi

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '1997'. డా.మోహన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ ఇదివరకే విడుదలైన విషయం తెలిసిందే.

అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నవంబర్ 26వ తేదీన విడుదల అవుతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని వార్తలు