హీరోయిన్‌ స్నేహకు గోల్డెన్‌ ఛాన్స్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..!

5 Sep, 2023 06:45 IST|Sakshi

నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తదుపరి తన 68వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!)

కాగా ఇందులో కొడుకు పాత్రకు జంటగా నటి ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇకపోతే తండ్రిగా నటించనున్న విజయ్‌ సరసన నటించే హీరోయిన్‌ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ పాత్రకు ముందుగా నటి జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత కారణాలు ఏమైనా ఆమె నటించడం లేదని తెలిసింది. ఆ తరువాత నటి సిమ్రాన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రచారం జరిగింది.

తాజాగా నటి స్నేహ పేరు వెలుగులోకి వచ్చింది. ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా 20 ఏళ్ల క్రితం విజయ్‌ సరసన స్నేహ వశీకర చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు విజయ్‌తో జత కట్టే అవకాశం వచ్చింది. మరి మరోసారి విజయ్‌తో జత కట్టడానికి సై అంటారా? లేదా? అన్నది చూడాలి. కాగా విజయ్‌ 68వ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు లండన్‌లో జరుగుతున్నాయి. అవి ముగియగానే చిత్ర షూటింగ్‌ ప్రారంభం అవుతుందని సమాచారం.

మరిన్ని వార్తలు