దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కాశీ విశ్వనాథ్‌

16 Nov, 2021 05:55 IST|Sakshi

తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన అధ్యక్షునిగా దర్శకుడు– రచయిత – నటుడు యనమదల కాశీ విశ్వనాథ్‌ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నవంబర్‌ 14న (ఆదివారం) జరిగిన ఎన్నికల్లో కాశీ విశ్వనాథ్‌ ప్యానల్‌ జయకేతనం ఎగురవేసింది. సముద్ర, చంద్రమహేశ్‌ ప్యానల్స్‌ నుంచి ఇద్దరు చొప్పున ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అధ్యక్షునిగా కాశీ విశ్వనాథ్, ప్రధాన కార్శదర్శిగా వీఎన్‌ ఆదిత్య, కోశాధికారిగా భాస్కర్‌ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మేర్లపాక గాంధీ, జీ.ఎస్‌.రావు, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణమోహన్‌ అనుమోలు, పెండ్యాల రామారావు, కార్యనిర్వహణ కార్యదర్శులుగా కొల్లి రాంగోపాల్, దొండపాటి వంశీ కృష్ణ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గుంటూరు అంజిబాబు, అల్లాభ„Š , పీవీ రమేశ్‌ రెడ్డి, కాటూరి రాఘవ, ఇ. ప్రేమ్‌ రాజ్, నీలం సాయిరాజేశ్, ఎం. సాయి సురేంద్ర బాబు, కూరపాటి రామారావు ఎన్నికయ్యారు. మహిళల రిజర్వేషన్‌ కోటాలో సౌజన్య, ప్రవీణలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 

మరిన్ని వార్తలు