2022 Roundup:అంచనాలతో 1000 కోట్లు.. అనుకోకుండా 400 కోట్లు.. సత్తా చాటిన పాన్‌ ఇండియా చిత్రాలు

20 Dec, 2022 13:52 IST|Sakshi

బాహుబలి లాంటి ఒక్క చిత్రం పాన్ ఇండియా విజయం సాధిస్తే.. అదే ఫీట్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుందా అంటే..తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు సమాధానం చెప్పాయి. వందల కోట్ల వసూళ్లు సాధించి సంచలన విజయం సాధించాయి. సౌత్ ,నార్త్ ను ఒక్కటి చేసేలా పాన్ ఇండియా హిట్ కొట్టాయి.  2022లో కూడా ఆ సీన్‌ రిపీట్‌ అయింది.  ఈ ఏడాదంతా బాక్సాఫీస్‌ వద్ద పాన్‌ ఇండియా జాతర కొనసాగింది. అంచానాలతో వచ్చి వెయ్యి కోట్ల కొల్లగొట్టిన చిత్రాలు..ఏ మాత్రం ఊహించకుండా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు ఉన్నాయి. మరి ఈ ఇయర్ సౌత్ నార్త్ అనే ఎళ్లలు చేరిపేసిన ఆ చిత్రాలపై ఓ లుక్కేయండి.

‘బహుబలి’ సిరీస్‌ సినిమాలతో టాలీవుడ్‌ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు రాజమౌళి. ఆయన ఈ ఏడాది మరో పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్రేక్షకులను పలకరించాడు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద వందల కోట్లను రాబట్టింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి చరిత్ర సృష్టించింది. 

ఇక ఈ ఏడాది రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన మరో చిత్రం ‘కేజీయఫ్‌ 2’.  కన్నడ స్టార్‌ యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో 2018లో వచ్చిన ‘కేజీయఫ్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే కేజీయఫ్‌ 2. ఈ ఏడాది ఏప్రిల్‌ లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. అంచనాలకు మించి రూ.1200 కోట్లను కొల్లగొట్టి ఔరా అనిపించింది. 


బహుబలి సాధించిన విజయం స్పూర్తితో..మణి రత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందించాడు. మల్టీస్టారర్ గా వచ్చిన ఈ మూవీ..ఇటు సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది.నాలుగు వందల యాభై కోట్లు కొల్లగొట్టింది.

అలాగే యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూడా ఈ ఏడాది ‘విక్రమ్‌’తో బాక్సాఫీస్‌పై తన విశ్వరూపాన్ని చూపించాడు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్‌ 3 విడుదలై పాన్‌ ఇండియా ప్రేక్షకుల మనసులను దోచు​కుంది. ప్రపంచవ్యాప్తంగా  ఈ చిత్రం రూ.450కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కమల్‌ హాసన్‌ సత్తాని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. 

ఈ ఇయర్ లో సౌత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి..నార్త్ లో కనికట్టుచేసిన మూవీ..కాంతార. ఇది ఎవరు ఉహించని విజయం..సర్పైజింగ్ సక్సెస్. నాలుగు వందల కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టింది.

మరోవైపు బాలీవుడ్ చిత్రం..బ్రహ్మస్త్ర కూడా..పాన్ ఇండియా హిట్ కొట్టింది. హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకొని..దక్షణాది ప్రేక్షకుల ప్రేమను కూడా గెలుచుకుంది. తెలుగు లాంగ్వెజ్ లో ఇరువై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది .అన్ని భాషల్లో కలుపుకొని..నాలుగు వందల కోట్లకు పైగా కొల్లగొట్టింది.ఇలా ఈ చిత్రాలన్ని..ఎళ్లలు దాటి విజయం సాధించాయి..వందల కోట్ల చిత్రాల  జాబితాలోకి చేరాయి.

మరిన్ని వార్తలు