Akhil Mishra: 3 ఇడియట్స్‌ నటుడు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న భార్య

21 Sep, 2023 13:01 IST|Sakshi

చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అఖిల్‌ మిశ్రా(58) కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్‌ 21) బాల్కనీలో ఏదో పని చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ అక్కడి నుంచి కిందపడటంతో అక్కడికక్కడే మరణించారు. నటుడి మరణంతో ఆయన భార్య సుజానే కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 'నా భాగస్వామి నన్ను వదిలేసి వెళ్లిపోయాడు, నా గుండె ముక్కలైంది' అని కన్నీటిపర్యంతమవుతోంది.

కాగా అఖిల్‌ మిశ్రా.. డాన్‌, వెల్‌డన్‌ అబ్బా, హజారన్‌ ఖ్వైషేన్‌ ఐసీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 3 ఇడియట్స్‌ సినిమాలో లైబ్రేరియన్‌గా నటించి జనాలకు మరింత దగ్గరయ్యారు. సినిమాలే కాకుండా సీరియల్స్‌, టీవీ షోలు కూడా చేశారు. 1983లో ఈయన తన సహనటి మంజు మిశ్రను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయనను ఒంటరి చేస్తూ 1996లో ఆమె మరణించింది. దీంతో 2009లో జెర్మన్‌ నటి సుజానే బెర్నర్ట్‌ను పెళ్లాడారు. 

చదవండి: మీరాకు కన్నీటి వీడ్కోలు.. భౌతికకాయం చూసి విద్యార్థుల కంటతడి!

మరిన్ని వార్తలు