మా సినిమాని కుటుంబమంతా కలసి చూడొచ్చు

28 Jan, 2021 05:07 IST|Sakshi
అనూప్, కార్తికేయ, అమృత, ప్రదీప్, మున్నా, ఎస్వీ బాబు

‘‘నేనీ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది. నా మీద నమ్మకంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’  సినిమా చేసే అవకాశం ఇచ్చాడు మున్నా. నా మొదటి సినిమాకే అంత మంచి ప్యాషన్‌ ఉన్న నిర్మాత బాబుగారు దొరకడం నా అదృష్టం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్‌ చేసే సినిమా ఇది’’ అని ప్రదీప్‌ మాచిరాజు అన్నారు. ఫణి ప్రదీప్‌ (మున్నా) దర్శకత్వంలో యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు, అమృతా అయ్యర్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ నీలి నీలి ఆకాశం..’ పాట ఒక ఏడాదంతా వినేలా చేసిందంటే మామూలు విషయం కాదు. పాట ఎంత పెద్ద హిట్‌ అయిందో సినిమా కూడా అంతే హిట్‌ కావాలి’’ అన్నారు. ‘‘నా ‘పటాస్‌’ సినిమాని యస్వీ బాబుగారు కన్నడలో రిలీజ్‌ చేశారు.

ఆయన తెలుగులో నిర్మించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సూపర్‌ హిట్‌ అవ్వాలి’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ‘‘అనూప్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రదీప్‌ మంచి హీరోగా స్థిరపడాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మా సినిమాకి ఓటీటీ రిలీజ్‌కి ఆఫర్స్‌ వచ్చినా మా కష్టాన్ని గుర్తించిన బాబుగారు థియేటర్స్‌లోనే  విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు ఫణి ప్రదీప్‌. ‘‘ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది. మా సినిమాని సక్సెస్‌ చేయాలి’’ అన్నారు చిత్రనిర్మాత ఎస్వీ బాబు. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాట ఎంతలా హిట్‌ అయిందో అంతకంటే గొప్పగా సినిమా ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌. అనంతరం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్లాటినమ్‌ డిస్క్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో అమృతా అయ్యర్, హీరో అడవి శేష్, నిర్మాత సి. కల్యాణ్, కెమెరామాన్‌ శివేంద్ర, సింగర్స్‌ సునీత, సిద్‌ శ్రీరామ్, పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ పాల్గొన్నారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు