30 రోజుల్లో..ఫస్ట్‌డే కలెక్షన్లు.. ప్రదీప్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

30 Jan, 2021 16:44 IST|Sakshi

త‌నదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమ‌ర్‌తో బుల్లితెరపై గొప్ప యాంకర్‌గా పేరు సంపాదించుకున్న ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్నా దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ శుక్రవారం(జనవరి 29) విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.4 కోట్ల గ్రాస్‌ సాధించింది. ఇక తన తొలి సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ప్రదీప్‌ సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఓ ఎమోషనల్‌ లేఖ రాసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.
(చదవండి : ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీ రివ్యూ)

‘ఒక చిన్న సినిమాకి విశేష స్పందన అందింది. ఎన్నో రోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈ రోజు సాధ్యం అయింది. నా కెరీర్‌లో అతిపెద్ద అడుగు నేను వేసేటప్పుడు ఇంతమంది సపోర్ట్‌ నాకు ఉండడం, అద్భుతమైన ఓపెనింగ్స్‌తో ఇంతమంది ప్రజలు థియేటర్స్‌కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు. ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటాను’అని ప్రదీప్‌ మాచిరాజు ట్వీట్‌ చేశాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు