Free OTT Platforms: ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూసేయొచ్చు

12 Jun, 2022 18:54 IST|Sakshi

కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల వినియోగం బాగా పెరిగిపోయింది. కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో గడప దాటి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం జనాలు ఓటీటీలను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. దీంతో దొరికిందే ఛాన్స్‌ అనుకున్న ఓటీటీ సంస్థలు అందినకాడికి దండుకుంటున్నాయి. హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, జీ 5 వంటి పెయిడ్‌ ఓటీటీలే కాకుండా ఉచితంగా లభించే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం..

ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌
ఉచితంగా లభిస్తుందంటున్నారు కాబట్టి ఇందులో పెద్దగా సినిమాలు, సిరీస్‌లు ఉండవేమో అనుకోకండి. ఇటీవలే కంగనా రనౌత్‌ లాకప్‌ షోను విజయవంతంగా రన్‌ చేసింది. ఆశ్రమ్‌ లాంటి స్పెషల్‌ వెబ్‌సిరీస్‌లు కూడా ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ సర్వీస్‌ కాబట్టి మధ్యమధ్యలో ప్రకటనలు వస్తుంటాయి.

జియో సినిమా
ఇది కూడా ఓటీటీ ప్లాట్‌ఫామే. జియో యూజర్స్‌ దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు. ఇందులో సినిమాలు మాత్రమే కాకుండా జియో టీవీ ద్వారా టీవీ ఛానెళ్లను, లైవ్‌ డిబేట్స్‌ను వీక్షించవచ్చు. ఇందులో కూడా యాడ్స్‌ వస్తాయి.

టీవీఎఫ్‌ ప్లే
ఇది కూడా ఫ్రీగా లభించే ఓటీటీ ప్లాట్‌ఫాం. ఇందులో యాస్పిరెంట్స్‌ సహా మరెన్నో సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలంటే వెంటనే దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అయిపోండి.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌
ఇది ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఎయిర్‌టెల్‌ వినియోగదారులైతే మీ నంబర్‌తో లాగిన్‌ అయి ఇందులో కంటెంట్‌ను ఎంచక్కా చూస్తూ కాలక్షేపం చేయొచ్చు.

వొడాఫోన్‌ ఐడియా మూవీస్‌ అండ్‌ టీవీ
వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులు ఈ ప్లాట్‌ఫాం ద్వారా బోలెడంత కంటెంట్‌ను ఉచితంగా చూసేయొచ్చు. మీ వొడాఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అయితే సరిపోతుంది.

A post shared by MX Player (@mxplayer)

A post shared by JioCinema (@officialjiocinema)

A post shared by Girliyapa (@girliyapa)

చదవండి: జీటీవీ పాపులర్‌ సీరియల్‌ ‘ఖుర్బాన్‌ హువా’ నటి గురించి మీకీ విషయాలు తెలుసా?
ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి

మరిన్ని వార్తలు