చిన్న సినిమాలకు ఇదే సరైన సమయం

21 Jun, 2022 04:59 IST|Sakshi
సుమంత్‌ అశ్విన్, మెహర్, ఎమ్మెస్‌ రాజు, కృతికా, రోహన్‌

-దర్శక- నిర్మాత ఎమ్మెస్‌ రాజు

‘‘7 డేస్‌ 6 నైట్స్‌’ డీసెంట్‌ ఫిల్మ్‌.. యువతరంతో పాటు ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మార్చి తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌ 2’ సినిమాలు విడుదలై, మంచి హిట్టయ్యాయి. చిన్న సినిమాలు రావడానికి సరైన సమయం ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత ఎంఎస్‌ రాజు. సుమంత్‌ అశ్విన్, రోహన్‌ హీరోలుగా, మెహర్‌ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘7 డేస్‌ 6 నైట్స్‌’. సుమంత్‌ అశ్విన్‌ .ఎం, రజనీకాంత్‌ .ఎస్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.

చిత్రదర్శకుడు ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా ఎన్ని వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూపించాలనుకుంటున్నాం. మా చిత్రాన్ని యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ టికెట్‌ రేట్స్‌ పెడుతున్నాం. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి సుమంత్, అమ్మాయి రిషితా దేవికి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు రిషితా దేవి. ‘‘7 డేస్‌ 6 నైట్స్‌’ నాకు ఒక మాస్టర్‌ పీస్‌లా అనిపిస్తోంది’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌. నిర్మాత రజనీకాంత్‌ .ఎస్, కో ప్రొడ్యూసర్‌ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు