ప్రపంచం ఎదురుచూస్తోంది

2 Mar, 2021 00:29 IST|Sakshi
వివేక్‌ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్, రామ్, సందీప్‌ కిషన్, అభిషేక్‌ అగర్వాల్, లావణ్యా త్రిపాఠీ, దయా వన్నెం

– రామ్‌

‘‘తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్‌ అవుతాయి.. మేమంతా ఎదురు చూస్తున్నాం’ అని లాక్‌డౌన్‌  సమయంలో దుబాయ్‌కి చెందిన ఓ నిర్మాత అన్నారు.. అంటే మన తెలుగు సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రతి యాక్టర్‌కీ ఒక పెద్ద హిట్‌ సినిమా అనేది వస్తుంది. సందీప్‌ కెరీర్‌లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అని హీరో రామ్‌ అన్నారు. సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్‌ జీవన్‌  కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’.

టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా వన్నెం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్‌ వేడుకలో  డెన్నిస్‌ జీవన్‌  మాట్లాడుతూ– ‘‘కథ వినగానే సందీప్‌ గ్రీన్‌  సిగ్నల్‌ ఇచ్చారు’’ అన్నారు. సందీప్‌ కిషన్‌  మాట్లాడుతూ – ‘‘ఎవరికీ అవకాశాలు రావు. వాటిని మనమే సృష్టించుకోవాలి. ఆ టైమ్‌లో అండగా నిలబడ్డవారే మనకు దేవుళ్లు... గొప్పవాళ్లు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్‌ 25వ సినిమా మా బ్యానర్‌లో చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌.

మరిన్ని వార్తలు