Aadhi Pinisetty: రామ్‌ తగ్గడం వల్లే నాకింత పేరొచ్చింది..

16 Jul, 2022 08:35 IST|Sakshi

‘‘నేను తెలుగువాణ్ణి అని తమిళ ప్రేక్షకులు అనుకుంటున్నారు.. తెలుగువాళ్లేమో తమిళోడిని అంటున్నారు. ప్రేక్షకులు ఇప్పుడు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, నటన బాగుంటే ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్‌ చేస్తున్నారు’’ అని నటుడు ఆది పినిశెట్టి అన్నారు. రామ్‌ పోతినేని, కృతీ శెట్టి జంటగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది వారియర్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ విలన్‌ గురు పాత్రలో నటించిన ఆది పినిశెట్టి శుక్రవారం విలేకరులతో చెప్పిన విశేషాలు

‘సరైనోడు’ తర్వాత ‘అజ్ఞాతవాసి’ సినిమాలో విలన్‌గా చేశాను. ఆ తర్వాత ఏ క్యారెక్టర్‌ వచ్చినా ‘అజ్ఞాతవాసి’ కంటే బెటర్‌గా ఉండాలని అనుకున్నాను. ‘ది వారియర్‌’లో ఆర్డనరీ విలన్‌గా కాకుండా, గురు పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్‌ ఉంది.. అది నచ్చడంతో ఈ చిత్రం చేశాను. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.  
‘ది వారియర్‌’ క్లైమాక్స్‌ ఫైట్‌లో రామ్, నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బావుంటుంది. ఆ క్రెడిట్‌ అన్బు–అరివు మాస్టర్లదే. మేమిద్దరం ఫైట్‌ చేస్తుంటే డ్యాన్స్‌ చేస్తున్నట్టుందని లింగుసామి చెప్పారు. ఇద్దరు హీరోలు సింక్‌లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది.

నాన్న (దర్శకుడు రవిరాజా పినిశెట్టి) నాలో నెగెటివ్‌ పాయింట్స్‌ చెప్తారు. ఈ చిత్రంలో నా యాస ఇంకొంచెం బాగుండాల్సింది అని మా నాన్న అన్నారు. నేను హైలైట్‌ అయ్యానంటే రామ్‌ గొప్పదనం అని, అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందని కూడా ఆయన అన్నారు. నిక్కీ గల్రానీతో నా పెళ్లి జీవితం బాగుంది.. అంతా హ్యాపీ.

చదవండి: లలిత్‌ మోదీ గట్టిగానే ట్రై చేశాడు, ఇన్నేళ్లకు ఫలించింది!
 లలిత్‌ మోదీతో డేటింగ్‌పై స్పందించిన సుష్మితా సేన్‌

మరిన్ని వార్తలు