సీక్రెట్‌గా నిశ్చితార్థం జరుపుకున్న హీరో, హీరోయిన్‌.. ఫోటోలు వైరల్‌

26 Mar, 2022 18:33 IST|Sakshi

యంగ్‌ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్‌ నిక్కీ గల్రానీ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌, కోలీవుడ్‌లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించింది ఈ జంట. అంతేకాదు తమ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని తెలియజేస్తూ... ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తమ ఎంగేజ్‌మెంట్‌ మార్చి 24న జరగ్గా.. రెండు రోజుల తర్వాత శనివారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

‘2022 మార్చి 24.. మా ఇద్దరికి ఎంతో స్పెషల్‌. కుటుంభ సభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. ఈ మా కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలి’అని తన ట్విటర్‌ ఖాతాలో ఫోటోలను షేర్‌ చేసింది నిక్కీ గల్రానీ.

‘యాగవరైనమ్‌ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి.  ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆది ఇటీవలె గుడ్‌ లక్‌ సఖి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు