స్ప్రింటర్‌గా ఆది పినిశెట్టి.. పోస్టర్‌ రిలీజ్‌

3 Sep, 2021 10:35 IST|Sakshi

ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్‌ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్‌’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఐబి కార్తికేయన్‌ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. ‘‘స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. సరైన స్ప్రింటర్‌లా కనిపించడానికి ఆది కఠినమైన శిక్షణ తీసుకున్నారు.

తమిళ–తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఒలింపిక్స్‌లో భారతదేశం మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నందున మా సినిమా టీజర్‌ విడుదలకు ఇది సరైన సమయం అని భావించి, ఈ నెల 6న టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. 

చదవండి : RC 15:  మరో వివాదంలో డైరెక్టర్‌ శంకర్‌..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు