క్రేజీ ఫెలో కోసం బరువు తగ్గాను

14 Oct, 2022 04:13 IST|Sakshi

‘‘క్రేజీ ఫెలో’ని  ఎంజాయ్‌ చేస్తూ, చేశాను. ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైనర్‌ మూవీ చూశామనే అనుభూతి కలిగిస్తుంది’’ అన్నారు ఆది సాయికుమార్‌. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్‌ హీరోగా కేకే రాధామోహన్‌ నిర్మించిన ‘క్రేజీ ఫెలో’ ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆది సాయికుమార్‌ చెప్పిన విశేషాలు...

► చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే యువకుడి పాత్రను ‘క్రేజీ ఫెలో’లో చేశాను. ఫణికృష్ణ చాలా మంచి కథ రాసుకున్నాడు. ఈ చిత్రంలో ఆర్గానిక్‌ కామెడీ ఉంటుంది. కామెడీ టైమింగ్‌లోనూ ఫణి స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాడు. సినిమా పట్ల అందరం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం. కథలో సెకండాఫ్‌ మంచి ఎమోషన్‌ సీన్స్‌ ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్రెష్‌ లుక్‌ ట్రై చేశాను.. బరువు తగ్గాను.

► నేను హీరోగా చేసే కొన్ని సినిమాల కథలను నాన్న (నటుడు సాయికుమార్‌)గారు వింటారు. ‘క్రేజీ ఫెలో’ కథ విని, హ్యాపీ ఫీలయ్యారు. నాన్నగారి అభిప్రాయం తీసుకోకుండా నేను చేసిన కొన్ని సినిమాలు అంతగా వర్కౌట్‌ కాలేదు. ‘గాలిపటం’ సినిమా కథ బాగుంది కానీ క్లయిమాక్స్‌ కాస్త మార్చితే బాగుంటుందని నాన్నగారు సలహా ఇచ్చారు. కానీ మేం ఒప్పుకోలేదు. ఆడియన్స్‌ ఆ క్లయిమాక్స్‌ ఒప్పుకోలేదు. ఇలా నాన్నగారి జడ్జ్‌మెంట్‌ బాగుంటుంది.

► ప్రస్తుతం ‘టాప్‌ గేర్‌’, ‘సీఎస్‌ఐ: సనాతన్‌’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘పులి–మేక’ అనే వెబ్‌ సిరీస్‌ చేశాను. నవంబరులో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కావొచ్చు. ‘అమరన్‌ ఇన్‌ సిటీ’ సినిమా షూటింగ్‌ ఇరవై శాతం పూర్తయింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా ఆగింది.

మరిన్ని వార్తలు