క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఆది ‘కిరాత‌క‌’ మూవీ, ఫస్ట్‌లుక్‌ విడుదల

8 Jul, 2021 17:36 IST|Sakshi

ఆది సాయికుమార్, పాయ‌ల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కిరాత‌క‌’. విజ‌న్ సినిమాస్‌ ప‌తాకంపై  ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్‌ను ఇటీవల ప్రకటించగా దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో గురువారం(జూలై 8) ‘కిరాతక’ ఫ‌స్ట్లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగస్ట్ 13 నుంచి ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్‌ స్పష్టం వెల్లించారు. 

ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పూత్ మాట్లాడుతూ.. ‘నేను ఇప్ప‌టివ‌ర‌కు చాలా క‌థ‌లు విన్నాను. కానీ ఈ థ్రిల్ల‌ర్ క‌థ‌ బాగా న‌చ్చింది.పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌ ఇది. అలాగే ఆదితో ఫ‌స్ట్ టైమ్ న‌టిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌, నిర్మాత నాగం తిరుపతిరెడ్డిలకు స్పెష‌ల్ థ్యాంక్స్‌’ అంటూ తెలిపింది. నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ‘మా విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ‘కిరాత‌క’ మూవీ రూపొందుతోంది. మా హీరో ఆది, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌ హిట్‌ కాంబినేష‌న్‌లో ఒక ప‌ర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో వస్తున్న ఈమూవీ మేకింగ్‌ విషయంలో ఎక్కడ తగ్గకుండా నిర్మిస్తున్నాము. డైరెక్టర్‌ వీర‌భ‌ద్రమ్‌ క‌థ వివరించగానే బాగా న‌చ్చింది.

త‌ప్ప‌కుండా మా సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే న‌మ్మ‌కం ఉంది. త్వ‌ర‌లో గ్రాండ్ ఓపెనింగ్ జ‌రిపి ఆగ‌స్ట్ 13 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని అన్నారు. అలాగే ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్ర‌మ్‌ మాట్లాడుతూ.. ‘ప్ర‌స్తుతం ఆర్టిస్టుల ఎంపిక జ‌రుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్  కీల‌క  పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఆది ఇంత వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ‘కిరాత‌క’ మూవీ క‌థ న‌చ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో న‌టించ‌డానికి  పాయ‌ల్ రాజ్‌పూత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్ట‌ర్ కూడా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది’ అని పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు