ఆది పినిశెట్టి- నిక్కీ ఎంగేజ్‌మెంట్‌ వీడియో వైరల్‌

29 Mar, 2022 19:40 IST|Sakshi

యంగ్‌ హీరో ఆది పినిశెట్టి హీరోయిన్‌ నిక్కీ గల్రానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న వీరి ఎంగేజ్‌మెంట్‌ ఇటీవలె అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.  బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈనెల 24న వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈ జంట ఇటీవలె అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఎంగేజ్‌మెంట్‌ సమయంలో నిక్కీ గల్రానీ ఎమోషనల్‌ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కాగా ‘యాగవరైనమ్‌ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది.

ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇటీవలో ఆది గుడ్‌ లక్‌ సఖి చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు