CSI Sanatan In OTT: ఓటీటీలో ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్‌ 'CSI సనాతన్‌'

10 May, 2023 16:47 IST|Sakshi

హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో ఆది సాయికుమార్‌. ఏడాదికి సుమారు నాలుగు చిత్రాలతో ఆడియెన్స్‌ ముందుకు వస్తున్నారు. తాజాగా 'CSI సనాతన్‌' అంటూ ఆది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: శ్రీజను టార్గెట్‌ చేస్తూ వీడియో షేర్‌ చేసిన కల్యాణ్‌దేవ్‌

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా వంటి ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.

ఆది సాయి కుమార్ యాక్షన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్రేక్షకులను సైతం ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదికి జోడీగా మిషా నారంగ్‌ హీరోయిన్‌గా నటించగా, నందిని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. చదవండి: ఎంపీతో హీరోయిన్‌ పరిణీతి ఎంగేజ్‌మెంట్‌.. అతిథులకు ఆహ్వానం

మరిన్ని వార్తలు