ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు

17 Oct, 2022 05:00 IST|Sakshi

– ఆది సాయికుమార్‌   

‘‘క్రేజీ ఫెలో’ సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. మౌత్‌ టాక్‌ చాలా బాగుంది’’ అని హీరో ఆది సాయికుమార్‌ అన్నారు. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్‌ హీరోగా, దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్‌ కథానాయికలుగా నటించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ– ‘‘క్రేజీ ఫెలో’ విజయం యూనిట్‌ అందరిది. మా బ్యానర్‌ ద్వారా ఆదికి మంచి సక్సెస్‌ ఇచ్చినందుకు హ్యాపీ’’ అన్నారు ‘‘మంచి సినిమా వస్తే థియేటర్‌కి వస్తామని ‘క్రేజీ ఫెలో’తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు ఫణికృష్ణ. ‘‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు దిగంగనా సూర్యవన్షీ, మిర్నా మీనన్‌.
∙మిర్నా మీనన్, ఆది, దిగంగన, రాధామోహన్, ఫణికృష్ణ

మరిన్ని వార్తలు