Aadi Sai Kumar: మూడు పాత్రల్లో ఆది సాయి కుమార్.. అవేంటంటే ?

20 Jun, 2022 08:38 IST|Sakshi

Aadi Sai Kumar Three Different Roles In Tees Maar Khan Movie: ఆది సాయికుమార్, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. సునీల్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ‘మనం ఆపాలనుకున్నంత పవర్‌ మన దగ్గర ఉన్నా.. మనం ఆపలేనంత పవర్‌ వాడి దగ్గర ఉంది.. సార్‌’, ‘బాగా రాసుకోండి.. బాగా కనపడాలి.. పేరు గుర్తుందిగా.. తీస్‌ మార్‌ ఖాన్‌’ అనే డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. 

‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రమిది. స్టూడెంట్, రౌడీ, పోలీస్‌.. ఇలా మూడు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో ఆది కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. 

చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్‌
సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు

మరిన్ని వార్తలు