ఆ సినిమాలు నమ్మకాన్ని ఇచ్చాయి: ఆది సాయికుమార్‌

15 Aug, 2022 09:15 IST|Sakshi

‘‘తీస్‌ మార్‌ ఖాన్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన తర్వాత థియేటర్స్‌కు జనాలు వస్తారా? రారా అని భయం ఉండేది. అయితే ‘బింబిసార, సీతారామం, కార్తికేయ 2’ చిత్రాలు అందరికీ మంచి నమ్మకాన్ని ఇచ్చాయి. ఆ చిత్రాల్లానే మా సినిమాను కూడా ప్రేక్షకులు  ఆదరించాలి’’ అన్నారు ఆది సాయికుమార్‌. ‘నాటకం’ ఫేమ్‌ కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వం వహించిన చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. ఆది సాయికుమార్, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించారు.

డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ– ‘‘పక్కా ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ సినిమా ఇది. తిరుపతి రెడ్డిగారు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు’’ అన్నారు. ‘‘మా సినిమా బాగా వచ్చింది’’ అన్నారు తిరుపతి రెడ్డి. ‘‘ఇప్పటివరకు కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు తీశాను. ఇప్పుడు పక్కా కంటెంట్, కమర్షియల్‌ను మిక్స్‌ చేసి తీసిన సినిమా ఇది’’ అన్నారు కల్యాణ్‌ జి. గోగణ. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ యాళ్ల తిర్మల్‌ రెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి కార్తీక్, నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు