ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సిద్ధపడ్డాను

11 Oct, 2020 07:30 IST|Sakshi

ఆహన కుమ్రా... ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయినా..  సిల్వర్‌ స్క్రీన్‌ మీద అయినా ఒక్కసారి ఆమెను చూస్తే గూగుల్లో  ఆమె మూవీస్‌ లిస్ట్‌ వెదుక్కొని మరీ చూడాల్సిందే. అదీ ఆహనా ప్రత్యేకత. అభినయంతో మాత్రమే సుపరిచితమైన  కళాకారిణి. 

  • పుట్టింది... లక్నోలో. పెరిగింది.. ముంబైలో. తండ్రి సుశీల్‌ కుమ్రా. ల్యుపిన్‌ లిమిటెడ్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా రిటైర్‌ అయ్యారు. తల్లి సురేశ్‌ కుమ్రా. ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో డీఎస్‌పీగా రిటైరయ్యారు. ఆహనాకు ఒక చెల్లి శివాని, తమ్ముడు కరణ్‌. 
  • అర్హతలు..  కామర్స్‌లో డిగ్రీ, థియేటర్‌లో డిప్లొమా, విజ్లింగ్‌ వుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ చేసింది. చిన్నప్పటి నుంచీ నటన మీద ఆసక్తి ఉండడంతో స్కూల్లో ఉన్నప్పుడే పృథ్వి థియేటర్‌లో జాయిన్‌ అయింది. కాలేజ్‌ చదువు తర్వాత ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా ‘థియేటర్‌ కంపెనీ ‘మోట్‌లే’లో నటించడం మొదలుపెట్టింది. ఆహనాకు పేరుతోపాటు బుల్లితెర అవకాశాలూ తెచ్చిపెట్టిన నాటకాలు ‘బై జార్జ్‌’, ‘సోనా స్పా’, ‘ఆర్మ్స్‌ అండ్‌ ది మ్యాన్‌’ మొదలైనవి. థియేటర్‌లో పనిచేస్తూనే టీవీ కమర్షియల్స్‌కూ సైన్‌ చేసింది ఆహనా. 
  • తొలి టీవీ సీరియల్‌... యుద్‌. ఫస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ... ‘మై’. ఈ రెండింటిలో ఆహనా కనబరిచిన నటన ఆమెను సినిమా తారను చేయడంతోపాటు ఓటీటీ స్టార్‌డమ్‌నూ అందించాయి. 
  • గుర్తింపునిచ్చిన సినిమాలు.. ది బ్లూబెర్రీ హంట్, ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్, లిప్‌స్టిక్‌ అండ్‌ మై బుర్ఖా.
  • వెబ్‌ సిరీస్‌ డెబ్యూ.. అఫీషియల్‌ చూక్యాగిరీ (యూట్యూబ్‌ సిరీస్‌) అభిమానులను పెంచిన వెబ్‌సిరీస్‌.. ఇన్‌సైడ్‌ ఎడ్జ్, ఇట్‌ హ్యాపెన్డ్‌ ఇన్‌ హాంకాంగ్, అఫీషియల్‌ సీఈఓగిరీ, రంగ్‌బాజ్, బాంబర్స్, యువర్స్‌ ట్రూలీ. 
  • అభిరుచులు.. పుస్తకాలు చదవడం, ప్రయాణాలు, స్విమ్మింగ్, కొత్త ప్రదేశాల్లో కాలి నడకన తిరగడం.
  • ‘‘యాక్టింగ్‌ ఫీల్డ్‌లోని కొన్ని పరిస్థితుల వల్ల నా కెరీర్‌ డిస్టర్బ్‌ అయ్యింది. కుంగిపోయాను. ఒకానొక సమయంలో ఆత్మహత్యకూ సిద్ధపడ్డాను’ అని చెప్పింది ఆహనా కుమ్రా  2018 మీటూ ఉద్యమసమయంలో.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా