నీ కోసం పది నిమిషాలు ఆలోచిస్తేనే...

26 Oct, 2020 14:12 IST|Sakshi

సూర్య కొత్త సినిమా ట్రైలర్  విడుదల

‘ఆకాశమే నీ హద్దురా’  ట్రైలర్   

ఆకట్టుకుంటున్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు

సాక్షి, హైదరాబాద్ : కరోనా కారణంగా వాయిదా పడిన తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’  ట్రైలర్ విడుదలైంది. దసరా పండగ సందర్భంగా సోమవారం దీన్ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో నటించగా, హీరో సూర్యకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. డైలాగ్ కింగ్ మోహన్ బాబుతోపాటు, హీరోయిన్ డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సంక్షోభంతో  నిర్మాతలు వాయిదా వేశారు. అలాగే దీన్ని త్వరలోనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో దీనిని విడుదల చేయాలని నిర్ణయించారు. అంతేకాదు  సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుకుంది. 

సిఖ్య , 2డీ ఎంట‌ర్‌టైన్ మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాకు మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.  అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితం ఆధారంగా  రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ మూవీని తొలుత అక్టోబర్ 30 విడుదల చేయాలని భావించినా...అననుకూల పరిస్థితుల నేపథ్యంలో నవంబర్12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు