ఈ కథలో నేనే హీరో!

6 Jul, 2021 01:59 IST|Sakshi

‘మళ్ళీరావా’ (2017), ‘దేవదాస్‌’ (2018) వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆకాంక్షా సింగ్‌ తాజాగా మరో తెలుగు సినిమా అంగీకరించారు. హీరో నాని తన సోదరి దీప్తీ ఘంటాని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, నిర్మిస్తున్న ‘మీట్‌ క్యూట్‌’లో ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ యాంథాలజీలో ఐదు భాగాలు ఉంటాయి. ఒక్కో భాగం ఇరవై నిమిషాల పాటు ఉంటుంది. ఈ భాగాల్లోని ఒక దాంట్లో ఆకాంక్ష లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. తన పాత్ర గురించి ఆకాంక్ష మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు చేయని పాత్రను  చేస్తున్నాను. ఈ కథలో నేనే హీరో’’ అన్నారు. 

మరిన్ని వార్తలు