అనుమతులకు టైమ్‌ పడుతుంది

24 Oct, 2020 03:52 IST|Sakshi

సూర్య హీరోగా మోహన్‌బాబు, అపర్ణా బాలమురళీ ప్రధాన పాత్రదారులుగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్‌డెక్కన్‌ అధినేత జి.ఆర్‌. గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం తమిళంలో ‘సూరరై పోట్రు’ పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 30న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. మొదట్నించి తన కెరీర్‌కు అండగా ఉన్న అభిమానులతో ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు సూర్య.

‘‘ఈ సినిమాకు సంబంధించి గతంలో ఎప్పుడూ చేయని లొకేషన్లలో షూటింగ్‌ చేయటం, భిన్న భాషలకు చెందిన వ్యక్తులతో పని చేయటం మాత్రమే మా ముందున్న సవాళ్లని అనుకున్నాను. వైమానికరంగం నేపథ్యంలో జరిగే కథ అని తెలిసిందే. నిజమైన ఇండియన్‌ యుద్ధవిమానాలు, సెక్యూరిటీతో డీల్‌ చేయాల్సి వచ్చింది. యన్‌.ఓ.సి (నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌) లు ఇంకా రావలసి ఉంది. అందుకే కొన్ని అనుమతుల కోసం ఇంకా సమయం పట్టేలా ఉంది. ఇప్పుడున్న కరోనా కాలంలో మిగతా అన్ని విషయాలకంటే దేశం తాలూకు ప్రాధాన్యాల మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది. సినిమా విడుదలయ్యేలోపు ట్రైలర్‌ను, ఈ లెటర్‌తో పాటు మన స్నేహం, ప్రేమానురాగాలకు గుర్తుగా ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ను అందిస్తున్నా’’ అన్నారు సూర్య. ఈ చిత్రాన్ని సూర్య, గునీత్‌ మోంగా నిర్మించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా