Aaliyah Kashyap: మరీ ఇంతలా.. ఆ ఫొటోలేంటి.. ట్రోలింగ్‌!

24 Aug, 2021 19:51 IST|Sakshi

Aaliyah Kashyap With Boyfriend Shane: ‘‘నా ప్రియమైన సఖుడా.. 22వ పుట్టినరోజు శుభాకాంక్షలు! ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిగా నన్ను మార్చావు. నిన్ను కలిసినందుకు నేనెంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు! ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ ప్రముఖ సినీ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కుమార్తె అలియా కశ్యప్‌ తన ప్రేమికుడు షేన్‌ గ్రెగోయిర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపింది.

ఈ సందర్భంగా అతడితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ క్రమంలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం అనురాగ్‌, అలియాను ఉద్దేశించి విపరీతపు కామెంట్లు చేస్తున్నారు. ‘‘అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు అలియా? మీ నాన్న తీసే సినిమాలు బాగానే చూస్తున్నట్టున్నావు. అందుకే ఇలా తయారయ్యావు.

ఆ ఫొటోలేంటి? దేనికైనా హద్దులు ఉంటాయి. అభిమానులతో అన్నీ పంచుకోవాల్సిన అవసరం ఉందంటావా? అనురాగ్‌ నువ్వేనా కాస్త చెప్పొచ్చు కదా’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, ఆమె ఫాలోవర్లు మాత్రం.. ‘‘మీ జోడీ క్యూట్‌ ఉంది అలియా. ఎవరేమన్నా ఇలాగే ఉండండి. కలకాలం కలిసి ఉండండి’’ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. కాగా డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన షేన్‌తో ప్రేమలో పడిన అలియా ఈ విషయాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు.

చదవండి: అవసరం లేకున్నా డైరెక్టర్‌ ఆ సీన్‌ తీశాడు!

గతంలో ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేనే ముందడుగు వేశాను. తన కోసం ఎంతగానో పరితపించిపోయాను. రెండు నెలలు మాట్లాడుకున్న తర్వాత తొలిసారి తనను కలిశాను. తను నన్ను ఎప్పుడెప్పుడు ముద్దు పెట్టుకుంటాడా అని ఎదురుచూశాను. అయితే, తను మాత్రం కాస్త సందేహించాడు. అందుకే, మాట్లాడుతుండగానే నేనే ధైర్యం చేసి ముద్దుపెట్టేశాను. తను అంటే నాకు అంతగా ఇష్టం ఏర్పడిపోయింది’’ అంటూ ప్రియుడిపై ప్రేమను చాటుకుంది.


తండ్రితో అలియా కశ్యప్‌

ఇక గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసేపూర్‌, బాంబే వెల్వెట్‌, మన్‌మర్జియాన్‌ వంటి పలు సినిమాల్లో భాగమైన అనురాగ్‌ కశ్యప్‌.. లస్ట్‌ స్టోరీస్‌, సాక్రెడ్‌ గేమ్స్‌ వంటి వెబ్‌సిరీస్‌లను తెరకెక్కించాడు. మొదటి భార్య ఆర్తీ బజాజ్‌ ద్వారా అతడికి కూతురు అలియా కశ్యప్‌ జన్మించింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కొన్నాళ్లుగా అనురాగ్‌ ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్‌, వివాహానికి ముందే శృంగారం వంటి పలు అంశాల గురించి ఈ తండ్రికూతుళ్లు సంభాషించిన వీడియో అప్పట్లో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: ‘పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ’.. దర్శకుడిని ప్రశ్నించిన కుమార్తె

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు