'ఆమని ఉంటే పక్కన... ఏమని చెప్పను భావనా'..

17 Jul, 2021 07:59 IST|Sakshi

అదిత్‌ అరుణ్, మేఘా ఆకాశ్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌ మేఘ’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘ఆమని ఉంటే పక్కన..’ పాటను హీరోయిన్‌ పూజా హెగ్డే విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా చిత్రానికి హరిగౌర చక్కని సంగీతం అందించారు.

లవ్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ కృష్ణకాంత్‌ రాసిన ‘ఆమని ఉంటే పక్కన..’ పాటను అనురాగ్‌ కులకర్ణి అద్భుతంగా పాడారు. అదిత్‌ అరుణ్, మేఘా ఆకాశ్‌లపై చిత్రీకరించిన ఈ ప్రేమ పాట అందరికీ నచ్చుతుంది. అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు