Aamir Khan : మీడియాకు అమీర్‌ ఖాన్‌ క్షమాపణలు.. కారణమిదే!

8 Aug, 2022 08:35 IST|Sakshi

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌ నటించిన తాజా చిత్రం లాల్‌ సింగ్‌ చడ్డా. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీ అయిపోయింది మూవీ టీం. ఇందులో భాగంగా చెన్నైలో ఓ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అయితే అనుకోని కారణాలతో ఈ ఈవెంట్‌ ఆలస్యం కావడంతో తమిళ మీడియాకు అమిర్‌ ఖాన్‌ క్షమాపణలు చెప్పారు.

లాల్‌ సింగ్‌ చడ్డా అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుందని పేర్కొన్నాడు. అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌, పారామౌంట్‌ పిక్చ‌ర్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య బాలరాజుగా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు