నాలుగేళ్లు డిప్రెష‌న్‌లో ఉన్నా: హీరో కూతురు

11 Oct, 2020 16:59 IST|Sakshi

క‌ళ్ల ముందు క‌నిపించేది నిజం కాదు. పెదాల‌పై క‌ద‌లాడే ద‌ర‌హాస‌మూ నిజం కాదు. ఆ న‌వ్వు వెన‌క విషాదాలు, బాధ‌లు, గాయాలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ వాటిని క‌నిపించ‌నీయ‌కుండా, మర్చిపోయేందుకు న‌వ్వును మించిన ఔష‌ధం లేదు. సినిమా వాళ్లు కూడా అంతే.. వాళ్ల వ్య‌క్తిగ‌త బాధ‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి అభిమానుల‌కు న‌వ్వుతూనే క‌నిపిస్తారు, న‌వ్వుతూనే ప‌ల‌క‌రిస్తారు..

ఇరా ఖాన్‌.. స్టార్ హీరో అమీర్ ఖాన్ మొద‌టి భార్య‌ కూతురు. ఆమె నాలుగేళ్లుగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారు. అక్టోబ‌ర్ 10, ప్ర‌పంచ మాన‌సిక ఆరోగ్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆమె ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశం పంపారు. "నాలుగేళ్లుగా డిప్రెష‌న్‌లో ఉన్నాను. వైద్యుల ద‌గ్గ‌ర చికిత్స తీసుకున్నాను, ప్ర‌స్తుతం బాగానే ఉన్నాను. ఓ ఏడాదిగా మాన‌సిక ఆరోగ్యం గురించి ఏదైనా చేయాల‌ని ఉంది. కానీ ఏం చేయాలో తోచ‌ట్లేదు అని చెప్పుకొచ్చారు. అందుకే మిమ్మ‌ల్ని నా జ‌ర్నీలో భాగం చేస్తున్నాను. అస‌లు నేనెందుకు ఒత్తిడికి లోన‌య్యాను? ఏంటి అనే విష‌యాల‌ను మీకు చెప్పాల‌నుకుంటున్నాను. దానివ‌ల్ల మీకు మాన‌సిక ఆరోగ్యంపై కాస్తైనా అవ‌గాహ‌న వ‌స్తుందేమో" అని ఆశిస్తూ వీడియో ముగించారు. ఇరా ఖాన్‌ త‌న డిప్రెష‌న్ గురించి మున్ముందు మ‌రిన్ని వీడియోలు చేయ‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: ఒకానొక సమయంలో ఆత్మహత్యకు సిద్ధపడ్డాను)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు