Aamir Khan Daughter Ira Khan: ఫిట్‌నెస్‌ ట్రైయినర్‌తో స్టార్‌ హీరో కూతురు ప్రేమాయణం, త్వరలో పెళ్లి!

23 Sep, 2022 14:50 IST|Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ తండ్రి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి పండగలు, స్పెషల్‌ డేస్‌ను సెలబ్రెట్‌ చేసుకున్న ఫొటోలను తరచూ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటుంది. అయితే దీనిపై ఎప్పుడూ ఐరా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా తమ రిలేషన్‌పై ఐరా అధికారిక ప్రటకన ఇచ్చింది. ఈ సందర్భంగా తాను ఎస్‌ చెప్పానంటూ ఐరా ఓ క్యూట్‌ వీడియో షేర్‌ చేసింది.

చదవండి: టీటీలో సినిమాల జాతర.. ఈ ఒక్కరోజే 14 చిత్రాల సందడి

ఇందులో నుపుర్‌ ఐరాకు రింగ్‌ తొడుగుతూ ప్రపోజ్‌ చేసినట్లు కనిపించాడు. సైక్లింగ్‌ పోటీలో భాగంగా నుపుర్‌ ఇటీవల విదేశాలకు వెళ్లాడు. అతనికి తోడుగా ఐరా కూడా వెళ్లింది. ఇక పోటీలు ముగిసిన వెంటనే ప్రియురాలి వద్దకు వచ్చిన నుపుర్‌ ఆమెను హత్తుకుని ముద్దాడాడు. అనంతరం మోకాలిపై కూర్చొని ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ఉంగరం తొడుగుతూ ప్రపోజ్‌ చేశాడు. ఇక వెంటనే ఐరా మురిసిపోతూ ప్రియుడికి తన చేయి అందించింది.  ఇక ఈ వీడియో ఆమె షేర్‌ చేస్తూ ‘నేను ఎస్‌ చెప్పాను’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

చదవండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్‌.. నటుడు ప్రభాకర్‌ షాకింగ్‌ రియాక్షన్‌

తన పోస్ట్‌పై పలువురు బాలీవుడ్‌ సినీ సెల్రబెటీలు స్పందిస్తూ ఈ లవ్‌ బర్డ్స్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదంత చూస్తుంటే త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది. ​కాగా కొన్నేళ్లకు ఆమీర్‌కు నుపుర్‌ ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలోనే నుపుర్‌తో ఐరాకు పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహితులు ఉన్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2020 నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉండగా.. తాజాగా తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు ఈ లవ్‌బర్డ్స్‌.  

A post shared by Ira Khan (@khan.ira)

మరిన్ని వార్తలు