Aamir Khan Daughter Ira Khan: త్వరలోనే అమీర్‌ ఖాన్‌ కూతురు పెళ్లి.. వేదిక ఎక్కడంటే!

14 Sep, 2023 14:55 IST|Sakshi

బాలీవుడ్ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడనుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉ‍న్న వీరిద్దరు 2020లో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాలో ఇద్దరు కలిసి ఉన్న రొమాంటిక్ పిక్స్ షేర్ చేశారు. 

(ఇది చదవండి: 7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్‌’ సరికొత్త రికార్డు)

ఉదయ్‌పూర్‌లో పెళ్లిసందడి

ఈ ప్రేమ జంట రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగే వేడుక కోసం ఇప్పటికే ప్లాన్‌ చేసినట్లు సమాచారం. అమీర్ ఖాన్ సైతం తన కుమార్తె వివాహా వేడుక కోసం ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగి ఇప్పటికే ఏడాది పూర్తి కావడంతో పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేశారు.  26 ఏళ్ల ఐరా  తన పెళ్లి ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జనవరి 3వ తేదీన పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు వివరించింది. 

ఐరా మాట్లాడుతూ..'మేం జనవరి 3న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఏ సంవత్సరం అనేది మేము నిర్ణయించుకోలేదు. జనవరి 3 మాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు మేమిద్దరం మొదటిసారి ముద్దుపెట్టుకున్న రోజు' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఓ సైక్లింగ్ ఈవెంట్‌ సందర్భంగా నుపుర్.. ఆమెకు ప్రపోజ్ చేశారు. అతను వృత్తిరీత్యా ఫిట్‌నెస్ కోచ్ కాగా.. అమీర్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చాడు. 

ఇదిలా ఉంటే ఐరా.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమార్తె. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత, డిసెంబర్ 2005లో కిరణ్ రావును అమీర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2022లో విడిపోయారు. అమీర్ ఖాన్ కుమార్తె 2019లో 'యూరిపిడెస్' మెడియా నాటకం  ద్వారా దర్శకురాలిగా అరంగేట్రం చేసింది.  అయితే తనకు నటిగా మారడం ఇష్టం లేదని ఐరా స్పష్టం చేసింది.

(ఇది చదవండి: అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్‌ బిజీ.. తాజాగా మరో సినిమా..)

A post shared by Ira Khan (@khan.ira)

మరిన్ని వార్తలు