‘టర్కిలో అతిపెద్ద సూపర్ స్టార్’

13 Aug, 2020 12:34 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోల్లో ఆమిర్‌ఖాన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో ఆమిర్‌కు విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలుస్తోంది. టర్కి ఎయిర్‌ పోర్టులో అతన్ని అభిమానులు చుట్టిముట్టి సెల్ఫీలు తీసుకుంటున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమిర్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’. ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ను చిత్రం బృందం టర్కిలో ప్లాన్‌ చేసింది. దీంతో సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇటీవల అమీర్‌ టర్కి వెళ్లారు.

అక్కడి ఎయిర్‌ పోర్టులో అభిమానులు సెల్ఫీల కోసం ఆయన‌పై ఎగబడ్డారు. ఆయన కళ్లజోడు పెట్టుకొని, ముఖానికి మాస్క్‌ ధరించి కనిపించారు. ‘టర్కీలో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్’ అని ఓ అభిమాని ట్విటర్‌లో అమీర్‌ వీడియోను పొస్ట్‌ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడిన విషయం తెలిసిందే. షూటింగ్‌ అనుమతులు ఇచ్చిన అనంతరం విదేశాల్లో​ షూటింగ్‌ చేస్తున్న రెండో సినిమా ‘లాల్‌సింగ్‌ చద్దా’. మొదటి సినిమా అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న బెల్‌ బాటమ్‌. ఈ మూవీ షూటింగ్‌ లండన్‌లో జరుగుతోంది. (అమిర్ నాకు పెట్ట‌కుండానే తిన్నారు: దీపిక‌)

టామ్‌హ్యాంక్స్‌ ముఖ్యపాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌గంప్‌’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్, ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు