Aamir Khan: రన్నింగ్‌ సీన్‌లో హీరోకు గాయాలు, అయినా పరుగు ఆపని బాలీవుడ్‌ స్టార్‌

13 Jul, 2022 15:57 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ షూటింగ్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు లాల్‌ సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా అతడు లాంగ్‌ రన్నింగ్‌ చేసే సీన్‌లో కాలికి గాయమైంది. అయినప్పటికీ ఆమిర్‌ ఆ గాయాన్ని లెక్క చేయలేదట. ఫిజియోతెరపీ చేయించుకోవాలి, హాస్పిటల్‌కు వెళ్దామని అక్కడున్నవాళ్లు సూచించినప్పటికీ కేవలం పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని తన పరుగు కొనసాగించాడట.

ఎంత నొప్పిగా అనిపించినా దాన్ని పంటి కింద భరించి సీన్‌ కంప్లీట్‌ చేశాడట. అందుకే కాబోలు ఆమిర్‌ను మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అంటుంటారు. కాగా లాల్‌ సింగ్‌ చద్దా సినిమాను ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ బ్యానర్‌పై కిరణ్‌ రావు నిర్మిస్తున్నారు. ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్‌, మోనా సింగ్‌, నాగచైతన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది.

చదవండి: అక్కడింకా మొదటి సినిమానే, అయినా రెమ్యునరేషన్‌ మాత్రం డబుల్‌..
షాకింగ్‌.. రియాపై ఎన్‌సీబీ చార్జిషీట్‌, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

మరిన్ని వార్తలు